నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Sunday, March 25, 2012

బ్రహ్మ చేత వ్యభిచారం చేయించి బ్రహ్మ రాతని తారుమారు చేసిన ధీశాలి -2


గురువు గారి కుమారుడి పేరు శంకరుడు అని ఆ ఊరిలోనే కూలీ పని చేస్తున్నాడని, కుమార్తె పేరు వసంత సేన అని, దగ్గరలోని ఒక పట్టణంలో వ్యభిచార వృత్తిలో ఉందనీ తెలుసుకున్నాడు. ముందు శంకరుడిని వెతుక్కుంటూ వెళ్ళాడు. వసంతుడిని చూడగానే "అన్నయ్యా" అని బావురుమన్నాడు శంకరుడు. పిల్లల దుస్థితి చూసి దుఃఖంతో మంచం పట్టి గురువు దంపతులు మరణించారని తెలుసుకున్నాడు వసంతుడు. చిన్న పూరిపాక, చినిగి పోయిన దుస్తుల్లో భార్య, ఒక కొడుకు, ఇంట్లో ఎక్కడ చూసినా తాండవిస్తున్న దారిద్ర్యం...ఇదీ శంకరుడి స్థితి. "బాధ పడకు. నేను చెప్పినట్లు చెయ్యి" అని చెప్పాడు వసంతుడు.
  

"ఆవుని తోలుకొని పట్టణానికి వెళ్దాం రా" అన్నాడు వసంతుడు. ఏమీ మాట్లాడకుండా ఆవుని తోలుకొని వసంతుడిని అనుసరించాడు శంకరుడు. నేరుగా సంతకు వెళ్ళారు ఇద్దరూ. అక్కడ ఒక దళారి దగ్గరకు వెళ్ళి "ఆవుని ఎంతకు కొంటావు" అనడిగాడు వసంతుడు. అతను చెప్పిన ధరకు దాన్ని అమ్మేశాడు. శంకరుడికి ఏమీ అర్ధం కాకపోయినా వసంతుడికి ఎదురు చెప్పలేదు. ఆవుని అమ్మగా వచ్చిన డబ్బుతో వంటకు అవసరమయిన సరుకులు, శంకరుడి భార్యకు, పిల్లలకు కొత్త బట్టలు కొన్నారు. ఇంటికి రాగానే ఆ సరుకులతో వంట చేయించాడు వసంతుడు. "ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వడ్డించు" అని చెప్పాడు. శంకరుడు మారుమాట్లాడకుండా చేశాడు.


"అన్నా ఇంతవరకూ ఆ ఆవు ఉంది కదా అన్న ధైర్యం ఉండేది. ఇప్పుడు ఆ ఒక్క ఆధారం కూడా లేకుండా పోయింది. దాన్ని అమ్మగా వచ్చిన డబ్బు కూడా అన్నదానానికి ఖర్చయింది. తెల్లవారితే ఎలా గడపాలో భయంగా ఉంది" అన్నాడు శంకరుడు ఆ రాత్రి వసంతుడితో. "ఏమీ ఆలోచించకుండా నిదురపో. పొద్దున్నకల్లా నీ ఆవు నీ ఇంట్లో ఉంటుంది" అని ధైర్యం చెప్పాడు. పొద్దున లేచి తలుపు తెరిచి బయటకు వచ్చిన శంకరుడి ఆశ్చర్యానికి అంతు లేదు. ఇంటి ముందు తన ఆవు ఉంది. శంకరుడి ఆస్థి ఎప్పుడూ ఒక ఆవే అని తను రాసిన రాత పొల్లుపోకుండా ఉండడానికి బ్రహ్మే స్వయంగా రాత్రికి రాత్రి ఒక ఆవుని తీసుకొచ్చి అక్కడ కట్టేశాడు. 
   

ఆ రోజు కూడా ఆవుని తీసుకెళ్ళి సంతలో అమ్మి వచ్చిన డబ్బుతో అన్నదానం చేయించాడు వసంతుడు. "ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఇలాగే చేస్తూ ఉండు" అని చెప్పి వసంత సేనని వెతుక్కుంటూ వెళ్ళాడు. అన్ని దానాలలో మిన్నదయిన అన్నదానం క్రమంతప్పకుండా చేస్తున్నందువలన శంకరుడు అమితమయిన పుణ్యం మూట కట్టుకున్నాడు. 


వాళ్లనీ, వీళ్ళనీ అడిగి వసంత సేన ఇల్లు కనుక్కొని వెళ్ళాడు. ఒక అవ్వతో కలిసి ఒక ఇంట్లో ఉంటోంది ఆమె. వసంతుడిని చూడగానే భోరుమని ఏడ్చేసింది వసంత సేన. "అన్నా, నేను పాపిని. పాప పంకిలంలో కూరుకు పోయాను. మీలాంటి ఉన్నతుడిని చూడ్డానికి కూడా నాకు అర్హత లేదు" అని బావురుమంది. "ఊరుకో. ఇవాళ్టి నుంచీ నేను చెప్పినట్లు చేయి" అని ఆమెని ఓదార్చాడు వసంతుడు. ఆ రాత్రికి విటులు ఎవరు వచ్చినా లక్ష వరహాలు చెల్లిస్తేనే లోపలికి ప్రవేశం అని చెప్పమని ఆమె దగ్గర ఉన్న అవ్వతో చెప్పడు. ఆమె ఆశ్చర్యపోయింది. "అయ్యా, ఇది జరిగే వ్యవహారం కాదు" అని ఏదో చెప్పబోయింది. "నేను చెప్పినట్లు చెయ్యి?" అన్నాడు వసంతుడు.
  

ఆ రాత్రి ఇద్దరు ముగ్గురు విటులు వచ్చి లక్ష వరహాలు అనగానే వెనుదిరిగి వెళ్ళారు. అది వాళ్ళు ఊహించలేని మొత్తం. అర్ధ రాత్రి సమీపిస్తున్నదనగా ఒక పురుషుడు లక్ష వరహాలతో వచ్చాడు. ఆ రాత్రి వసంత సేనతో గడిపి వెళ్ళాడు. ఆ మరుసటి రాత్రి కూడ అలానే జరిగింది. తన రాత తప్పకూడదని లక్ష వరహాలు ఇచ్చి వసంత సేనతో సంభోగించింది సాక్షాత్తూ బ్రహ్మే అని వసంతుడికి తెలుసు. బ్రహ్మ సంభోగం వలన అప్పటి వరకూ ఆమె మూటగట్టుకున్న పాపాలన్నీ పటపంచలయిపోయాయి. 

6 comments:

జలతారు వెన్నెల said...

భలే బాగుందండి!
వసంతుడి ఎడ్రెస్స్ ఇస్తారా ప్లీస్?పోనీ ఇమెయిల్ ఇచ్చినా ఫర్లేదు.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

వసంతుడు ప్రస్తుతం హిమాలయాల్లో ఉంటున్నాడు. సెల్ ఫోన్స్, ఈ మెయిల్స్ లాంటి ఆధునిక జాడ్యాలకి అతను దూరం. ఈ సారి ఇటు వేపు వస్తే మీకు కబురు పెడతాను.

Anonymous said...

KRISHNA గారూ మీనుంచి ఇంత సంప్రదాయబద్ధమైన టపా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా బావుంది. ఇలాంటివి మరిన్ని రాయండి. గుడ్డలిప్పి తిరిగే బజారు ముండలకి చోటు కొంచెం తగ్గించండి మీ బ్లాగులో.

said...

i read this story in sakshi. Adrustanni marchukunna vallu ani. they said its a translation from a bengali story.

Anonymous said...

jThis isfrom a sanskrit fable.

More Entertainment said...

hii.. Nice Post Great job. Thanks for sharing.

Best Regarding.

www.ChiCha.inMore Entertainment